మహాత్ముడికి ఘన నివాళులు

హైదరాబాద్​ : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి శుక్రవారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు,మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించినవారిలో ఉన్నారు. గాంధీ జీవితం పలువురికి స్ఫూర్తి దాయకమన్నారు.భారత స్వాతంత్య్ర పోరాటాన్ని,గాంధీజీని విడదీసి చూడలేం అన్నారు. భారతీయులుగా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందని వారు వ్యాఖ్యానించారు.