రేపు నీటి సరఫరా బంద్

వరంగల్ అర్బన్ జిల్లా: నగరంలోని ప్రతాప రుద్ర ఫిల్టర్ బెడ్ (దేశాయిపేట ఫిల్టర్ బెడ్), వరంగల్ యందు పైపులైన్లు, వాల్వ్‎ల మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఫిల్టర్ బెడ్ పరిధిలోని ప్రాంతాలైన బ్యాంకు కాలనీ, రామ్ నాథ్ పురి, శ్రీనివాస కాలనీ, కొత్తపేట మొగిలిచెర్ల, రెడ్డి పాలెం, క్రిస్టియన్ కాలనీ, ఎస్.ఆర్.టి, ఓ-సిటీ, చార్ బౌలి, కాశిబుగ్గ, ధర్మారం, శివ నగర్, చింతల్, పుప్పాల గుట్ట, పైడిపల్లి, ఆరేపల్లి, ఎనుమాముల, ఎస్.ఆర్. నగర్, బాలాజీ నగర్, టి.ఆర్.టి, లేబర్ కాలనీ,అబ్బని కుంట, వరంగల్ చౌరస్తా,మట్వాడా, జీ. ఆర్.గుట్ట తో పాటు ఫిల్టర్ బెడ్ పరిధిలోని విలీన గ్రామాల్లో బుధవారం నీటి సరఫరా ఉండదని బల్దియా డీఈ సజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.