నూతన సీపీగా బాధ్యతలు చేప్టిన తరుణ్ జోషి

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ తరుణ్ జోషి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తరుణ్ జోషి మీడియాతో మాట్లాడారు. గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడమే తన ముందున్న లక్ష్యమని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. సీపీగా బాధ్యతలు తీసుకునే ముందు రోజు కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న తరుణ్ జోషికి సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్ లో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తూ, దస్త్రాలపై సంతకం చేశారు. అనంతరం సీపీ తరుణ్ జోషి, ఐజీ ప్రమోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ads