కల్తీ నెయ్యి విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

ఒంగోలు జిల్లా : ఒంగోలు పట్టణంలో కల్తీ నెయ్యి విక్రయాలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు, స్వీట్స్ షాప్స్ , హోల్ సేల్ షాప్స్ పై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందం దాడులు నిర్వహించింది. కల్తీ నెయ్యి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్స్, స్వీట్స్ షాప్స్ మరియు హాల్ సేల్ షాప్స్ నిర్వహణపై వచ్చిన కంప్లైంట్స్ తో ప్రత్యేక నిఘా బృందం దాడులు నిర్వహించి, సదరు గూడెంలో సుమారు 1000 కేజీల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. అనుమతులు వున్న, బ్రాండ్ ఉన్న ఆహార పదార్ధాలు, వాటి ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని, ఆరోగ్యనికి హాని కలిగించే వస్తువులు తయారీ లేదా విక్రయం చేసిన యెడల ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు.

ads

కల్తీ ఆహార పదార్థాలపై సమాచారం తెలిస్తే డయల్ 100 కు లేదా 9121102266 కి వాట్సాప్ ఫోన్ నెంబర్ కు మెసేజ్ ద్వారా గాని, ఫోన్ కాల్ ద్వారా గాని సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అటువంటి సదరు సమాచారం తెలియచేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, జిల్లా వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించటానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ దాడులు నిర్వహించటంలో ప్రత్యేక చొరవ చూపిన ఒంగోలు తాలూకా పోలీసులు మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.