గడువులోగా పనులు పూర్తి చేయాలి

వరంగల్​ అర్బన్​ జిల్లా : కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో పలు అభివృద్ధి పనులను కమిషనర్​ పరిశీలించారు. గడువులోగా పనులను నాణ్యత తో పూర్తి చేయాలని ఆదేశించారు. లష్కర్​ సింగారంలో వడ్డేపల్లి సర్ప్​ప్లస్​ నాలాపై రూ 3.5 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పద్మాక్షి దేవాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ వైకుంఠధామం పనులను పరిశీలించి పక్షం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పద్మాక్షి దేవాలయం ఆవరణలో రాష్ర్టంలో నే ప్రథమంగా రూ 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సరేగమపదనిస పార్క్ పనులను చూశారు. ఇంకా అసంపుర్తిగా ఉన్న గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్, ప్రహరీ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట కుడా పీవో అజిత్ రెడ్డి, ఈ ఈ భీంరావు, డీఈ, ఏ ఈ లు ఉన్నారు.

ads