టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

హైదరాబాద్‌ : తెలంగాణలో టీడీపీలో టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరగా, తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపినట్లయింది. ఈ క్రమంలో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన లేఖను శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.

ads