ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

అమరావతి : ఓటరుకు సమాచారం చేరనీయకుండా కొన్ని తెలుగు న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను ప్రభుత్వం అడ్డుకుంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, బుద్దా వెంకన్న గురువారం ఫిర్యాదు చేశారు. అధికార వైసీపీ ఏబీఎన్, టీవీ-5 తెలుగు ఛానెళ్ల ప్రసారాలను అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ప్రసారాలను టెలికాస్ట్ చేయొద్దంటూ మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్​వోల) పై బెదిరింపులకు దిగుతోంది తెలిపారు. మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రాధమిక హక్కులను అడ్డుకోవడమేని ఫిర్యాదులో నాయకులు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఏ) ను అమలు చేస్తూ పత్రికా స్వేచ్చను కాపాడాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ నాయకులు.