వైసీపీలో చేరికలు

గుంటూరుజిల్లా : ఇరవై కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు శనివారం హోంమంత్రి మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. కాకుమాను మండలానికి చెందిన టీడీపీ నాయకులు, గుంటూరు బ్రాడీపేట నివాసం వద్ద కొల్లిమర్ల గ్రామానికి చెందిన నాయకులు పార్టీలో చేరగా వారికి హోం మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాకుమాను మండల కన్వీనర్ నల్లమోతు శివరామ కృష్ణ, వైసీపీ గ్రామ నాయకులు కంచెర్ల వీరస్వామి, ఉప్పలపాడు చంటి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలుకు ఆకర్షితులై పార్టీ లో చేరుతున్నట్లు గడ్డం కోటేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి హోంమంత్రి సుచరిత ఎంతో కృషి చేస్తున్నారని మండల కన్వీనర్ శివరామకృష్ణ పేర్కొన్నారు. పార్టీలోచేరిన వారికి హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.