టీం ఇండియా వినూత్న సాధన

సౌతాంప్టన్ : న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ( డబ్ల్యూటీసీ ) ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. కివీస్ తో చారిత్రక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఈ నెల 18న ప్రారంభంకానుంది. నెట్ సెషన్స్ తర్వాత ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా, బ్యాట్స్ మెన్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజిస్ బౌల్ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్ లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్ చేయగా పుజారా, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ చేశారు. మిగతా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేశారు. కెప్టెన్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ ను పర్యవేక్షించాడు. మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ads