కీలక వికెట్లు కోల్పోయిన టీంఇండియా

చెన్నై: ఇంగ్లాండ్‎తో రెండో టెస్టులో టీం ఇండియా స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. భారీ శతకంతో చెలరేగిన ఓపెనర్ రోహిత్ శర్మ ( 161: 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ) జాక్ లీచ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. రోహిత్ మరో బ్యాట్స్‎మెన్ రహానెతో కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొయిన్ అలీ వేసిన 76వ ఓవర్లోనే రహానే (67:149 బంతుల్లో 9 ఫోర్లు) బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్న జోడీ వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఊపిరిపీల్చుకున్నది. 76 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. రిషబ్ పంత్, అశ్విన్ క్రీజులో ఉన్నారు.