శ్రీలంక రెండో వన్డేలో టీమిండియా విజయం

కొలంబో : శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన భారత్ దీపక్ చహర్ ( 82బంతుల్లో 69 నాటౌట్ : 7 ఫోర్లు, 1 సిక్స్ ) పోరాటంతో 3 వికెట్లతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. చరిత్ అసలం (65 ; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50 ; 4 ఫోర్లు, 1 సిక్స్ ) అర్ధసెంచరీలు సాధించారు. భువనేశ్వర్, చహల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చహర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

ads

అనంతరం 276 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ( 44 బంతుల్లో 53 ; 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ (28 బంతుల్లో 19 నాటౌట్ ; 2 ఫోర్లు ) చివరల్లో చహర్ కు చక్కని సహకారం అందించాడు. భారత్ 193/7 తో కష్టాల్లో పడిన దశలో వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు అజేయంగా 84 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టాడు.