హనుమంతు రెడ్డికి కన్నీటి వీడ్కోలు

చిత్తూరు జిల్లా : ప్రభుత్వ విప్ ​, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు హనుమంతు రెడ్డి కి కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం తుమ్మల గుంటలోని ఆయన నివాసం నుంచి సాగిన హనుమంతు రెడ్డి అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, తరలివచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని ఫోన్లో పరామర్శించారు. హనుమంతు రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డిలు హనుమంత్​రెడ్డి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నివాళులు అర్పించిన వారిలో టీటీడీ బర్డ్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, టీడీపీ నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, కందాటి శంకర రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్, హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్, భూమన అభినయ రెడ్డి, వైఎస్సార్సీపీ తిరుపతి అధ్యక్షులు పాలగిరి ప్రతాప రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, వివిధ కార్పొరేష్లన్ ల డైరెక్టర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు పలువురు ఉన్నారు.