రంజాన్ కానుకలు అందచేసిన ప్రభుత్వ చీఫ్ విప్

వరంగల్ అర్బన్ జిల్లా : మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని దాస్యం వినయ్ భాస్కర్ ప్రతీ యేడాది మాదిరిగానే ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ కానుకగా దుస్తులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రంజాన్ కానుకలను హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో లబ్దిదారులకు పంపిణీ చేశారు. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సుమారు 35 మసీదులకు 150 చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లు అందిచనున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి 6500 గిఫ్ట్ ప్యాకెట్లు కేటాయించారన్నారు.

ads

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముస్లిం, మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 252 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు 38 మైనార్టీ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో సీఎం కేసీఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో 6 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు 3 మైనార్టీ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మందికి రంజాన్ కానుకలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటం గర్వకారణమని అన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ముస్లిం సోదర సోదరీమణులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు.