శ్రీవారిని దర్శించుకున్న​ గవర్నర్​

చిత్తూరు జిల్లా : తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళసై సౌందర్​రాజన్​ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్​కు టీటీడీ ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్​ను పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ‘స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్​ రావడం గర్వకారణం. వ్యాక్సిన్​ రావడానికి సహకరించిన ప్రధాని మోదీకి, డాక్టర్స్​కు, ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా’ అని గవర్నర్​ తమిళసై సౌందరరాజన్​ అన్నారు.