ప్రజా శ్రేయస్సే ధ్యేయం

కామారెడ్డి జిల్లా : ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను ప్రారంభించారు.

ముందుగా గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ. 22 లక్షలతో రైతు వేదిక, రూ. 5 లక్షలతో ముదిరాజ్ సంఘం భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ. 3.14 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 డబుల్ బెడ్ రూం ఇళ్ళను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా గ్రామంలో హనుమాన్ మందిరం విస్తరణ పనులు, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించే మరో 50 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్ పర్సన్ శోభా రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి , అడిషనల్ కలెక్టర్ వెంకటేష్​ ధోత్రే, ఆర్డీవో రాజాగౌడ్, కామారెడ్డి జిల్లా ఆర్ఎస్​ఎస్​ అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం గంగాధర్ , బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకటరామ్ రెడ్డి, జెడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, దేశాయిపేట్ సర్పంచ్ శ్రవణ్ , ఏంఎసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్​ నాయకులు పోచారం సురేంద్ర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.