రాష్ట్రం సేఫ్..నో లాక్ డౌన్..

హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సరిహద్దు రాష్ట్రాలయిన మహారాష్ట్ర , కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా ఉన్నాయన్నారు. సరిహద్దు దగ్గ కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టబోమన్నారు. ముఖ్యంగా అక్కడి వారితో, చుట్టరికంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్ననందున ఆ రాష్ట్రాల ప్రజలతో తెలంగాణ జనం జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనా విషయంలో అలసత్వం వహించద్దని సీఎం కేసీఆర్ కూడా ఆదేశించినట్లు మంత్రి ఈటెల తెలిపారు.

ప్రస్తుతం టెస్ట్‎ల నుంచి బెడ్స్ వరకు అన్ని అందుబాటులో ఉన్నాయని, సింటమ్స్ వస్తే టెస్ట్ చేయించుకోండి లేదా రోగ తీవ్రతను బట్టి హాస్పిటల్ అడ్మిట్ కండి అని ఈటెల కోరారు. మాస్క్ అనేది కరోనా రాకుండా ఉండేందుకే కాదు, ఇతర వ్యాధులు, డస్ట్ నుంచి కూడా రక్షణగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని ఈటెల చెప్పారు.

టెస్టింగ్ కిట్స్ దర చాలా తగ్గాయని అన్నారు. పగటి పూట వేడి, రాత్రి చల్లదనం ఉంటే, వైరస్ వ్యాప్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. మరొక 15 నుంచి 20 రోజుల్లో ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది కాబట్టి వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయన్నారు. వ్యాక్సిన్‎ను బయటి మార్కెట్‎లో అందుబాటులో ఉండేలా కేంద్రం చూడాలన్నారు. కరోనా విషయంలో నిరంతరం రీసెర్చ్ జరుగుతుండాలన్నారు. హార్ట్ ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి కరోనా మరింత తగ్గొచ్చని తెలిపారు.