మే 17నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​?

హైదరాబాద్ ​: రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు పున: ప్రారంభంకానున్నాయి. నైన్త్ క్లాస్​ నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో టెన్త్​ ఎగ్జామ్స్​ ఎప్పుడు నిర్వహిస్తారా..? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం నెలకొంది. అయితే మే17 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మే 26 తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, ఆ మరుసటి రోజు నుంచి జూన్​ 13వతేదీ వరకు సమ్మర్​ హాలీడేస్​ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ సర్కార్​కు పంపింది. ఈ ఏడాది 70 శాతం సిలబస్​తోనే ఎగ్జామ్స్​ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.