సింఘు బార్డర్‎లో ఉద్రిక్తత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రెండు నెలలకుపైగా అక్కడ నిరసన చేస్తున్న రైతులు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ల ర్యాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనతో బెంబేలెత్తిన స్థానిక ప్రజలు. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ భారీగా నిరసనకు దిగారు.

కొందరు నిరసనకారులు రైతుల గుడారాలపై రాళ్లు విసరడంతోపాటు గుడారాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు నిరసనకారులతో ప్రతిఘటించడంతో పోలీసులు యాక్షన్‎లోకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో నిరసనకు దిగిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.