టీజీసెట్‌ నోటిఫికేషన్​ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్‌-2021 దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు టీజీసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి 180042545678 అనే టోల్‌ ప్రీ నంబరును ప్రారంభించారు.

ads

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు వినియోగించుకోవాల్సిన వెబ్‌సైట్లు

www.tswreis.in, tgcet.cgg.gov.in, trresidential.gov.in, tgtwgurukulam.telangana.gov.in, mjptbcwreis.telangana.gov.in