అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. రేపు సభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చను 17న చేపట్టనున్నారు. 18న బడ్జెట్ ను ప్రవేశపెట్టి, 20వ తేదీ నుంచి చర్చ చేపట్టనున్నారు.

ads