అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చివరి రోజు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ , ఎంపీ బండ ప్రకాష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇతర స్థానిక నేతలతో కలిసి పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. 2వ డివిజన్లోని గుండ్ల సింగారంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కల్పన భానోత్, 41 వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోశాల పద్మ, 42 వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కేడల పద్మకు మద్దతుగా రోడ్డు షోలు, ర్యాలీలలో పాల్గొన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ads