శిఖర్ ధావన్‎పై ఛార్జిషీట్

వారణాసి : ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. గురువారం అతనిపై వారణాసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‎లోని బర్డ్ ఫ్లూ మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్న అభియోగాలను అతనిపై మోపారు. గంగా నదిలో పడవపై వెళ్తూ, పక్షులకు తినిపిస్తూ తీసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‎లో షేరు చేసుకున్నాడు. ఇదే అతన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఇది బర్డ్ ఫ్లూ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందంటూ అడ్వొకేట్ సిద్ధార్థ్ శ్రీవాస్తవ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 6న దీనిపై కోర్టు విచారణ జరుపనుంది.

అయితే కేవలం ఆ పడవ నడిపిన వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని, ధావన్‎పై ఎలాంటి చర్యలు ఉండబోవని ఈ మధ్యే వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ చెప్పారు.