సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం

హైదరాబాద్ : నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగిన సీఎం, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు.సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతా‎ధికారులు, ఇంజనీర్లు ఉన్నారు. రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విషయం విదితమే. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు.