అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం

అమరావతి : రాష్ట్రంలో భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైస్‌.జగన్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాపునేస్తం పథకం అమలు వర్చువల్‌ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ads