కొవిడ్​ టీకా సురక్షితమైనది

హైదరాబాద్​ : కొవిడ్​ టీకా సురక్షితమైనదని సీఎఎస్​ సోమేశ్​కుమార్​ అన్నారు. కింగ్ కోఠి లోని జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ టీకా రోల్ అవుట్ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వ్యాక్సినేషన్ పంపిణీకి తీసుకున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల రోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.

ads

‘రాష్ట్ర వ్యాప్తంగా 48 ప్రభుత్వ, 44 ప్రైవేటు ఆసుపత్రులలో మూడో దశ టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ వెల్లడించారు. యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీకా కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. ఈ టీకా సురక్షితమైందని వైద్యులు, శాస్త్రవేత్తలు పరీక్షించారని సీఎస్​ వివరించారు. అనంతరం పీ సంజీవ్ రావు, హర్భజన్ సింగ్ బగ్గా, పీ విజయ లక్ష్మి తదితరులు టీకాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యదర్శి ఎస్​ఏ ఎం రిజ్వీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి, కింగ్ కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్ జీ రాజేంద్రనాథ్​, డీఎంహెచ్​వో హైదరాబాద్ జే వెంకట్ అధికారులు పాల్గొన్నారు.