ఈనెల 16 వ‌ర‌కు మార్కెట్ బంద్‌

వరంగల్ అర్బన్ జిల్లా : కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 3 సోమవారం నుంచి 16వ తేదీ ఆదివారం వరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కు బంద్ ప్రకటించినట్లు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. మే 17 సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్ య‌థావిధిగా ప‌నిచేస్తుంద‌న్నారు. వ్యవసాయ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న ప‌లువురు ఉద్యోగులు, వ్యాపారుల‌కు కరోనా వ్యాధి సోకడంతో తీవ్ర భయాందోళనలకు గుర‌వుతున్నార‌న్నారు. దీంతో సంబంధిత సెక్షన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ బంద్ చేసినట్లు పేర్కొన్నారు.

ads