షీ పాహి మొదటి వార్షికోత్సవం

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసుల షీ పాహి మొదటి వార్షికోత్సవ వేడుకలు రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, సీపీ సజ్జనార్, సినీ నటి అనుష్క శెట్టి తో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షీ పాహి వీడియో సినీ నటి అనుష్క శెట్టి ప్రారంభించారు.

‘ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ కొవిడ్ టైం లోచాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది “షి” పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుంది
సమాజం లో ఒకరికి ఒకరు తోడు గా ఉండాలి’ అన్నారు సినీ నటి అనుష్క శెట్టి.