వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

మహబూబ్ నగర్ జిల్లా : వాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హోం మంత్రి మహమూద్​ అలీ, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ముస్లిం మైనారిటీ వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.హోంమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనతో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఆకాక్షించారు. అనుకోకుండానే హోంమంత్రి మహమూద్ అలీ జన్మదినం, ముస్లిం మైనార్టీ వర్గాల పట్టభద్రులతో సమావేశం ఒకే రోజు కావడం సంతోషంగా ఉందని వేముల అన్నారు.

ads

టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని హోం మంత్రి మహమూద్​ అలీ కోరారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ మీద నాలుగో పేరు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఉంటుందని దాని పక్కనే ఒకటి అనే అంకె వేయాలని సూచించారు. ఓటు ఉన్న వారు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు లేనివారు పది ఓట్లు వేయించాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గంగా-జామున-తహెజీబ్ ల ఉన్న తెలంగాణ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ నాయకులు పాల్గొన్నారు.