బాధిత కుటుంబాలపై దృష్టి పెట్టాలి

ads

వరంగల్​ అర్బన్​ జిల్లా : దివంగత పోలీసు బాధిత కుటుంబాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని వరంగల్​ సీపీ పోలీస్ అధికారుల సంఘానికి పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఏఎస్సై కుటుంబానికి బుధవారం వరంగల్ సీపీ భద్రత కింద మంజూరైన ఆర్థికసాయాన్ని అందజేశారు. కమినషనరేట్ పరిధిలోని బచ్చన్నపేట పోలీస్ స్టేషన్​ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం నవంబర్ 13 న ఏఎస్సై కాసం దేవేందర్ మృతిచెందారు. ఆయన కుటుంబానికి అరోగ్య భద్రత కింద మంజూరైన రూ.4 లక్షల చెక్కును సీపీ దేవేందర్​ సతీమణి ఉమకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సిన బకాయిలను త్వరగా అందేలా చూడాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ సీపీ ప్రమోద్​కుమార్​కు విజ్ఞప్తి చేశారు.