ఆకుపచ్చ జిల్లాగా మార్చాలనేదే ధ్యేయం

హైదరాబాద్ : కరువు జిల్లాను ఆకుపచ్చ జిల్లాగా మార్చాలనేదే సీఎం కేసీఆర్​ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు చెందిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై ,ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే ఆయకట్టు వివరాలు నియోజకవర్గాల వారీగా అడిగారు. వారికి మంత్రి హరీశ్​రావు సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ads

నాగర్ కర్నూల్ 40 వేల 64 వేల ఎకరాలు.

మహబూబ్ నగర్ వ 15 వేల 73 ఎకరాలు.

కొడంగల్ లక్ష 17 వేల 135 ఎకరాలు .
నారాయణ పేట్ 63 వేల 382 ఎకరాలు.

మక్తల్ 66 వేల 963 ఎకరాలు.

దేవర కద్ర 42 వేల 723 ఎకరాలు.

జడ్చర్ల 1 లక్ష 46 వేల 676 ఎకరాలు.

కల్వకుర్తి 96 వేల 398 ఎకరాలు.

అచ్చం పేట 2675 ఎకరాలు.

పరిగి 90 వేల 28 ఎకరాలు.

వికారాబాద్ 94 వేల 871 ఎకరాలు.

తాండూరు 1లక్ష 2 వేల 797 ఎకరాలు.

చేవెళ్ల 1 లక్ష 24 వేల 714 ఎకరాలు.

షాద్ నగర్ 79 వేల 996 ఎకరాలు.

ఇబ్రహీంపట్నం 69 వేల 57 ఎకరరాలు.

రాజేంద్రనగర్ 8 వేల972 ఎకరాలు.

మహేశ్వరం 39 వేల 137 ఎకరాలు.

దేవరకొండ 23 వేల 35 ఎకరాలు.

మునుగోడు 6 వేల304 ఎకరాలు.

19 నియోజకవర్గాలు 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి హరీశ్​రావు వివరించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తికి, జూరాలకు లింక్ కెనాల్ ప్రతిపాదన ఏమైనా ఉందా..? అని మరో ప్రశ్నను సభ్యులు అడిగారని మంత్రి హరీశ్​రావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టులు అంటే పెండింగ్ ప్రాజెక్టులుగా పేరు పడిందని మంత్రి ఆరోపించారు. వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కోయిల్ సాగర్, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందిస్తున్న విషయం తెలిసిందే అన్నారు. అలాగే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన జరపడానికి పాలమూరు రైతుగా, ఓ ఇంజినీర్ గా సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు.

వరుసగా మూడు రోజులు పాలమూరు ప్రాజెక్టులను రీ డిజైనింగ్ కోసం సీఎం జిల్లా ఎమ్మెల్యేలు , ఇంజినీర్లను కూర్చోపెట్టుకోని రివ్యూ చేశారని గుర్తుచేశారు. చరిత్ర లో నిలిచేలా పాలమూరు జిల్లాకు శాశ్వతంగా ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ రెండు ఆలోచనలు చేశారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. పాలమూరు నుంచి కల్వకుర్తికి, పాలమూరు నుంచి జూరాలకు లింక్ చేసే పని చేస్తున్నారన్నారు. కష్టకాలంలో యాసంగి పంటలో చిట్టచివరి పొలాన్ని సైతం తడిపేందుకు కేసీఆర్ లింక్ కెనాల్ ప్రతిపాదన చేశారన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు విషయంలో జరిగింది ఎందంటే దాని ఆయకట్టు పెరిగి 3 లక్షల 98 వేల 105 ఎకరాల కు చేరిందన్నారు. కానీ రిజర్వాయర్లకు ఆ సామర్థ్యం లేదని మంత్రి హరీశ్​రావు స్పష్టంచేశారు.

గుడిపల్లి రిజర్వాయర్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ 3 వేల 250 క్యూసెక్కుల నీరు లిఫ్ట్ ద్వారా వస్తుంది. 1250 క్యూసెక్కులు అచ్చంపేటకు వెళ్లగా మిగిలిన 2 వేల క్యూసెక్కులతో గుడిపల్లి గట్టు కింద చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని మంత్రి హరీశ్​రావు అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి కాలువకు అనుసంధానం చేయాలని సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్​రావు సంతోషం వ్యక్తంచేశారు. జూరాల జలాశయం విషయంలోనూ యాసంగి పంటకు సమస్య వస్తుంది. జారాల మీద నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కురుముర్తి జలాశయం నుంచి జూరాలకు లింక్ ఇవ్వాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు.

కోయిల్ సాగర్ ఎగువన పెద్ద వాగులో నీళ్లు వదిలితే అమ్మాపూర్ వద్ద ఆనకట్టికట్టి జూరాల జలాశయానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రీ డిజైనింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చాలా స్పీడుగా పని పూర్తి చేయాలని నిర్ణయించాం . కానీ కోర్టుల్లోనూ, హైకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి ఇబ్బందులు సృష్టించారన్నారు. ఆ కేసులన్నీ పరిష్కారం అయ్యాయి. గత ఏడాది కొవిడ్​ వల్ల లేబర్ సొంత ఊర్లకు వెళ్లిపోవడంవల్ల జాప్యం జరిగిందని మంత్రి హరీశ్​రావు వివరించారు. పూర్తి స్థాయిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్​ ప్రతీ రోజు దీనిపై సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు.

90 శాతం భూసేకరణ పూర్తయింది. కేవలం 2400 ఎకరాలు మాత్రమే ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు.
అన్ని రిజర్వాయర్లు, అప్ టూ ఉద్దండాపూర్ వరకు డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని మంత్రి హరీశ్​రావు సభ దృష్టికి తీసుకువచ్చారు. అదే రీతిలో కొండగల్ నియోజక వర్గ కాలువలకు సంబధించి సర్వేలన్నీ పూర్తయాయన్నారు. వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారన్నారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రకటించారు.