గంటకుపైగా గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం గంటన్నరకు పైగా కొనసాగింది. ఉదయం 11:05 గంటలకు ప్రారంభమైన ప్రసంగం 12:15 గంటలకు ముగిసింది.

ads

ప్రసంగం ముగిసిన తర్వాత గవర్నర్ తో పాటు సభ్యులందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‎కు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. సభా మందిరంలోకి గవర్నర్ ఎర్ర తివాచీపై నడుచుకుంటూ వెళ్లారు.