సీఎంను కలిసిన నీతి ఆయోగ్​ బృందం

హైదరాబాద్​ : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వయిజర్ రవీంద్ర ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చీ ఆఫీసర్ కామరాజులతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.