కేసీఆర్ పై వెల్లువిరిసిన అభిమానం

వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు , రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించడంపై నాయీబ్రాహ్మణులు, రజకులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాత సెలూన్ అసోసియేషన్ మరియు రజక సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. హన్మకొండ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చొరవతో హన్మకొండలోని 847 సెలూన్లు, అందులో పనిచేసే వ్యక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం 100% తీసుకోవడం జరిగిందని వరంగల్ అర్బన్ జిల్లా సెలూన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగవెల్లి సురేష్ కుమార్ అన్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న క్షౌరవృత్తిదారులందరికీ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు తీసుకునే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా సెలూన్ అసోసియేషన్ కృషి చేస్తోందని సురేష్ కుమార్ వెల్లడించారు. తమకు సహకరించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కు నాయీబ్రాహ్మణులందరి తరపున , రజకులందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ads

ఈ కార్యక్రమంలో లాండ్రి అసోసియేషన్ అధ్యక్షులు పైండ్ల బిక్షపతి , రజక సంఘం సీనియర్ లీడర్ ఎల్లయ్య, రాజు మరియు నాయి బ్రాహ్మణ కుల పెద్దలు తూముల సాంబయ్య, గజవల్లి తిరుపతి, నాగవల్లి కృష్ణ, సింగారపు శ్యామ్, శ్రీరాముల నరేందర్, మొగిలిచర్ల ప్రసాద్, కామోజి జగన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.