మొక్కలు నాడటం సంతోషంగా ఉంది

ఢిల్లీ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాడటం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ పిలుపు మేరకు ఢిల్లీలోని అధికార నివాసం వద్ద ఎంపీ నామ నాగేశ్వరరావు మొక్కలు నాటారు.

ads

జాతీయ అడవుల పాలసీ లో పేర్కొన్న విధంగా అడవుల విస్తీర్ణం రాష్ట్రం లో 23 శాతం నుంచి 33 శాతం పెంచే విధంగా సీఎం కేసీఆర్​ హరితహారం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటి వాటిలో 80 శాతం పైగా మొక్కలు సంరక్షించే చట్టం తెచ్చినట్లు తెలిపారు. తెలంగాణను సీఎం కేసీఆర్​ హరిత మయం చేశారని ఎంపీ నామ కొనియాడారు. సీఎం కేసీఆర్​కు మద్దతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా, దేశ విదేశాల్లో సైతం విరిగా మొక్కలు నాటేలా చైతన్యం తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయని ఎంపీ నామ అన్నారు. ఇదే స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా యావత్ తెలంగాణ, భారత దేశం పచ్చగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ కన్న కలలు సాకారం కావాలని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.