తుఫాన్ వలె కరోనా సెకండ్ వేవ్ : ప్రధాని

ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. లాక్‌డౌన్ విధించే పరిస్థితులు రావొద్దని కోరుకుందాం. అందరూ సంయమనం పాటిస్తే రెడ్‌జోన్‌లు గట్రా పరిధులు వేసే అవసరం ఏర్పడదు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. ప్రజలందరూ సంఘటితంగా ఒకరికొకరు సహాయ పడాల్సిన సమయం ఇది. ధైర్యంగా ఉండండి.

ads

వైద్య రంగంతో పాటు ప్రతీ ఫ్రంట్‌లైన్ వారియర్‌కి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాక్సిన్, రోగ నిరోధక మందులని మరింత వేగంగా ఉత్పాదించాలని ఫార్మా రంగానికి సూచించాం. అవసరమైన సహాయం అందిస్తున్నాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ దిశగా పనిచేస్తుందని తెలిపారు. .. శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు‌ మనందరిపై ఉండాలని కోరుకుంటాను!