హైదరాబాద్ : ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్పహక్కు అని విద్యావేత్త టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పీ ఎల్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రజలకు, విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఆన్లైన్ సదస్సు నిర్వహించారు.
‘భారత దేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం లో ఓటరుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ ఓటుతో శాసించగలిగే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎంఎల్సీ ఎన్నికలకు 2017 కి ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటును నమోదు చేసుకునే అవకాశం పొడగించబడినదని తెలిపారు. ఇంకా ఓటు నమోదు చేసుకొని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’ అని టీఆర్ఎస్ నాయకుడు పీఎల్ శ్రీనివాస్ అన్నారు.
సదస్సుకు హాజరైన పార్టీ కార్యకర్తలు ఓటరు నమోదుకై జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో గల డిగ్రీ, బీఈడీ, ఎంబీఏ మరియు పాఠశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, టీచర్లు గ్రాడ్యుయేట్లు మరియు మూడు జిల్లాలకు చెందిన తెరాస పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ క్రింద తెలుపబడిన లింక్ తో ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx