పచ్చిస్​ ప్రభరిలా పాత్ర కీలకం

వరంగల్​ అర్బన్​ జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో పచ్చిస్ ప్రభరిలా పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, మాజీ మంత్రి ఇనుగాలపెద్దిరెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ లో అర్బన్ జిల్లా స్థాయి వరంగల్ , ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాసులు హాజరయ్యారు.

‘కేంద్రం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో విస్మరించిందని ఆయన విమర్శించారు. ఇక్కడి రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని విమర్శించడం చాలా బాధాకరమని శ్రీనివాసులు అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా, అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిలువునా నిర్లక్ష్యం చేస్తూ కనీసం ఎటువంటి కొలువులను కల్పించకుండా వారిని మోసం చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి శ్రీనివాసులు ఆరోపించారు. సమైక్య పాలనలో అన్నిరంగాల్లో రాష్ట్రం నష్టపోయిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అన్యాయానికి గురవుతుందని శ్రీనివాసులు విమర్శించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రులు, ఇనుగాల పెద్దిరెడ్డి, గుండె విజయరామారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ టీ రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, ధర్మరావు , సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర నాయకులు గురుమూర్తి శివ కుమార్, చాడ శ్రీనివాస్ రెడ్డి, రత్నం సతీష్ షా, కుసుమ సతీష్, అచ్చ విద్యసాగర్, పులి సరోత్తం రెడ్డి , కార్పొరేటర్లు చాడ స్వాతి, కొరబొయిన సాంబయ్య, జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, దేశినీ సదానందం గౌడ్, బాకం హరి శంకర్, సంగని జగదీశ్వర్, మండల సురేష్, పాసికంటి రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.