పథకం ఏదైనా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభం

కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను హుజురాబాద్ నుండే ప్రారంభించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేతల ఈటల చేసిన విమర్శలపై ప్రతి విమర్శలు చేసిన అనంతరం గంగుల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకంపై మాట్లాడారు. దళితబంధు పథకం గురించి మాట్లాడిన గంగుల రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా లోపాలు గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టు చేపడుతారని అన్నారు.

ads

అందుకే దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని రాష్ట్రంలోని నిరుపేద దళిత వర్గాలందరికీ చేయూతనీయాలన్నది సర్కారు లక్ష్య మన్నారు మంత్రి గంగుల. ప్రపంచంలోనే గొప్ప పథకం రైతు బంధని అలాంటి పవిత్ర పథకం హుజురాబాద్ లో ప్రారంభించడం వల్ల సక్సెస్ అయింది కాబట్టే అలాంటి పవిత్రమైన దళిత బంధు కూడా రైతు బంధులాగా సక్సెస్ చేయాలని కోరారు. అందుకే హుజురాబాద్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

ఈ నిర్ణయం ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారని, ఈ ఎన్నికలకు దళితబంధు పథకానికి సంబంధం లేదన్నారు మంత్రి గంగుల. కలెక్టర్ బదిలీపై కూడా స్పందించిన మంత్రి బదిలీ వెనక ఎలాంటి కారణం లేదని దళిత బంధు అద్భుతంగా టేకాఫ్ చేయాలంటే దళితుల మీద ప్రేమ ఉన్న అధికారులను నియమించాలనే ఆలోచనతో రెగ్యులర్ బదిలీ మాత్రమేనన్నారు. హుజురాబాద్ లో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిలో కేసీఆర్ ను చూసుకుంటామని ప్రజలు కూడా అదే విధంగా ఓటేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.