ఈ నెల 15న కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

సూర్యాపేట జిల్లా : భారత్ చైనా బోర్డర్ లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన సూర్యపేట ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు భారత దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న ఆయన విగ్రహన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్ట్ చౌరస్తాలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ads

సంతోష్ బాబు సూర్యపేట పేరును జాతీయ స్థాయికి తీసుకుపోయాడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ..వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా జిల్లా కేంద్రంలోని ప్రముఖ కోర్ట్ చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.