సమీకృత కలెక్టరేట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

వరంగల్ అర్బన్ జిల్లా : సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను హైదరాబాద్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ చీఫ్(ఈఎన్సీ) గణపతి రెడ్డి, సీఎంఓ అడ్వైజర్ సుధాకర్ తేజలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీకృత కలెక్టరేట్ పరిధిలో మిగిలి ఉన్న ఫర్నిచర్, పార్టిషన్ చివరి పనులను త్వరితగతిన పూర్తి చేసి కార్యాలయాలను తరలించేందుకు సన్నద్దం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పురోగతి పై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్సీ నాగేందర్ రావు, డి ఈ మనోహర్, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

ads