భారత్‎లో కొత్త రకం కరోనా

న్యూఢిల్లీ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్ (SARS-CoV-2) ఆనవాళ్లను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇండియాలో 771 రకాల కరోనావైరస్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇందులో ఇప్పటివరకు ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా ఉందని వెల్లడించింది. దాన్ని డబుల్ మ్యుటెంట్ (రెండుసార్లు రూపాంతరం చెందే) అని పిలుస్తారని తెలిపింది. ఈ రకం వేరియంట్‌ను 18 రాష్ట్రాల్లో గుర్తించారు. 771 రకాల్లో బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు ఉన్నాయని స్పష్టం చేసింది.

ads