స్వచ్ఛందంగా వ్యాక్సిన్​ తీసుకోవాలి

హైదరాబాద్​ : స్వచ్ఛందంగా వ్యాక్సిన్​ వేసుకోవడం మంచిదని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. శనివారం డీజీపీ కొవిడ్​ వ్యాక్సిన్​ వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా అందరూ ముందు కు వచ్చి టీకా తీసుకోవాలని సూచించారు. కొవిడ్ ను కట్టడి చేయడం లో తెలంగాణ ఆరోగ్య శాఖ ఎంతో కృషి చేసిందని డీజీపీ మహేందర్​రెడ్డి కొనియాడారు. అలాగే ఆరోగ్య శాఖ లో ఉన్న సిబ్బంది ఎంతో బాగా పనిచేశారని చెప్పారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖ లో మొత్తం 60 వేల మంది ఉన్నారు. అందరూ ముందు కు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి 4 రోజుల పాటు పోలీస్ శాఖకు వ్యాక్సినేషన్​ నిర్వహిస్తారని వెల్లడించారు. అవసరమైతే ఈ తేదీని పొడగించాలని కోరతామని డీజీపీ మహేందర్​రెడ్డి వెల్లడించారు.