వన్యప్రాణులను చంపుతున్న వారిని శిక్షించాలి

మహబూబాద్ జిల్లా : అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను చంపడానికి బాంబులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అటవీ జంతువులను చంపడానికి బాంబులు పెడుతున్న ఫారెస్ట్​ అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ads

మండలంలోని వినోబా నగర్ అటవీ ప్రాంతంలో కొండమీద మల్లయ్య అనే వ్యక్తి నాటు బాంబులు తయారు చేస్తున్నారన్నారు. ఆ బాంబులను తులారాం ప్రాజెక్టు సరిహద్దు ప్రాంతంలో పెట్టారని తెలిపారు. దీంతో నీటి కోసం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆ బాంబుల వాసనకు జంతువులు వాటిని కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందుతున్నాయని వారు విచారం వ్యక్తం చేశారు.

గురువారం దేవి అశోక్ అనే గొర్రెల కాపరి గొర్రెల ను మేపడానికి ప్రాజెక్టు పరిసర ప్రాంతానికి వెళ్లాడు. ఆయనతో వచ్చిన పెంపుడు కుక్క ఆ బాంబు వాసనకు వెళ్లి కొరకడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. ఈ ప్రదేశం జీవరాశులను మేపడానికి తీసుకెళ్లి ప్రదేశమని గ్రామస్తులు చెప్పారు. మనుషలు , పశువులు కాని అనుకోకుండా బాంబుపై కాలు పెడితే అక్కడికి అక్కడే మృతి చెందే అవకాశం ఉంది అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్​ అధికారులు అటవీ జంతువుల కోసం బాంబులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.