ముగ్గురు సైనికులు మృతి

జైపూర్ : రాజస్థాన్ లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం, రాజీయాసర్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం బోల్తాపడగా, మంటలు చెలరేగాయి. గాయపడిన ఐదుగురు సైనికులు వాహనం బయటకు రాగా, ముగ్గురు అందులోనే చిక్కుకుపోయారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ads