సుప్రీంకోర్టు జడ్జిలుగా ముగ్గురు న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు జడ్జిలుగా ముగ్గురు న్యాయమూర్తులు

వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలో కూడిన కొలీజియం సోమవారం ముగ్గురు న్యాయ మూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎంపిక కోసం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇందులో కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.అంజరియా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, అలాగే బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.