చెన్నై: సరదా కోసం సముద్రంలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన చైన్నైమెరీనా బీచ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు ఆంధ్రా ప్రాంతానికి విద్యార్థులు స్నేహితులతో కలిసి ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం చెన్నై వెళ్లగా ఈ ఘటన జరిగింది.
నందిగామ అడవిరావులపాడు కి చెందిన సూరా గోపిచంద్(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు.
చెన్నైలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్(18) తోపాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్, శివప్రశాంత్ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు