టిక్ టాక్ భార్గవ్ అరెస్ట్

ads

హైదరాబాద్ : టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియా జనాలకు బాగా తెలిసిన భార్గవ్ ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. విశాఖ సింహపురి కాలనీలో ఉండే భార్గవ్ పక్కంటి బాలికను నమ్మించాడు. టిక్ టాక్ వీడియోలంటే ఇష్టపడే బాలికని చెల్లెలుగా చూసుకునేవాడు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇదే అదనుగా భావించి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు బాలికను 4 నెలల గర్భం అని తల్లికి తెలియడంతో అసలు విషయం బయటపడింది. ఫన్ బకెట్ షో ద్వారా కూడా గుర్తింపు పొందిన భార్గవ్ పై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భార్గవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.