నేడే భద్రాద్రిరామునికి మహాపట్టాభిషేకం

భద్రాద్రి : భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి బేడా మండపంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మహాపట్టాభిషేకం కార్యక్రమం జరుగనుంది. దీనికి నిత్యకళ్యాణ మండపం వేదిక కానుంది. అయితే కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేడు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 27 వరకు నిత్యకళ్యాణాలు, కరోనా నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థప్రసాదాలు నిలిపివేశారు.

ads