బీహెచ్ఈఎల్ లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్ : ప్రభుత్వరంగ సంస్థ, రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( బీహెచ్ఈఎల్ ) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి , అర్హత కలిగిన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏడాది కాలపరిమితికి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

ads

మొత్తం పోస్టులు : 130
ఇందులో ఫిట్టర్ 58, ఎలక్ట్రీషియన్ 18, మెషినిస్ట్ 16, మెషినిస్ట్ గ్రైండర్ 3, టర్నర్ 15, వెల్డర్ 11, కార్పెంటర్ 2, ఫౌండ్రీ మ్యాన్ 2, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ో 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 1, మోటార్ మెకానిక్ 1, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 1 చొప్పున ఖాళీలున్నాయి.

అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 2021, మార్చి 1 నాటికి 27 ఏండ్లలోపువారై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితితో సడలింపులు ఉంటాయి. 2018 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ లో

దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 11

వెబ్ సైట్ : https:/apprenticeshipindia.org/,https://hpep.bhel.com/