సరస్వతి పుష్కరఘాట్ కు పోటెత్తిన భక్తులు

సరస్వతి పుష్కరఘాట్ కు పోటెత్తిన భక్తులు

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సరస్వతి పుష్కరాలు 11వ రోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి భక్తజనం పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మే 22నుంచి సరవస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మే 26 వరకు 12 రోజుల పాటు కొనసాగే ఈ పుష్కరాలకు తెలంగాన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతున్నారు. ఇక మే 26న పుష్కరాలు ముగుస్తుండటంతో భక్తులు భారీగా కాళేశ్వరానికి పోటెత్తారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పుష్కరఘాట్ కు వచ్చే మూడు దారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం రూట్ ను వన్ వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అదే పరిస్థితి. సుమారు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయిన భక్తులు ఓ వైపు ఉక్కపోత, మరోవైపు తాగునీటి సమస్యతో తల్లాడుతూ పుష్కరఘాట్ కు నడుచుకుంటూ చేరుకున్నారు.